లేటెస్ట్‌గా లాంచ్ అయిన యాపిల్ ఐఫోన్ 17 కోసం ఇవాళ యువత పోటీపడ్డారు. ముంబైలోని BKC జియో సెంటర్‌లోని ఆపిల్ స్టోర్ వద్ద గంటల తరబడి క్యూలో ఉన్న యువకులు ఒకరినొకరు తోసుకుంటూ ఘర్షణ పడ్డారు. స్టోర్ బయట కొట్టుకున్నారు. వారిని సెక్యూరిటీ గార్డులు కంట్రోల్ చేశారు. అటు ఢిల్లీ, బెంగళూరు, పుణేలోనూ ఈ లగ్జరీ ఫోన్ల కోసం యువత ఎగబడుతున్నారు.