నిద్రలేమి సమస్య యువత ఆరోగ్యం, జ్ఞానం, ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా అమెరికాలో జనరేషన్ జెడ్‌లో 70% మంది ఆర్థిక వ్యవస్థ గురించి తీవ్రంగా ఆలోచిస్తూ నిద్రలేమితో బాధపడుతున్నారని ఇటీవల నిర్వహించిన అధ్యయనం పేర్కొంది. 69% మంది డబ్బు గురించి, 47% మంది ఉద్యోగ భద్రత గురించి ఆందోళన చెందుతూ మెలకువతో ఉంటున్నారని, నిద్రపట్టనప్పుడు చాలామంది సోషల్ మీడియా, టీవీలు చూడటం లేదా బెడ్‌రూమ్‌కే పరిమితం అవుతున్నారని తెలిపింది.