అమెరికన్ యూట్యూబర్ మిచెల్ హ్యారీ, 'మిషన్ ఇంపాజిబుల్ - రోగ్ నేషన్' చిత్రంలో టామ్ క్రూజ్ చేసిన స్టంట్‌ను నిజ జీవితంలో రిపీట్ చేసింది. 600 మీటర్ల ఎత్తులో, గంటకు 260 కి.మీ. వేగంతో ప్రయాణిస్తున్న C-130 మిలిటరీ విమానం డోర్ వద్ద చిన్న తాడు సాయంతో వేలాడుతూ మృత్యువుని ఎదుర్కొంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మిచెల్ సాహసానికి నెట్టింట్లో ప్రశంసలు దక్కుతున్నాయి.