ఆసియా కప్ ముందే శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. హరారేలో జరిగిన రెండో టీ20లో జింబాబ్వే చేతిలో లంక 80 పరుగులకే ఆలౌట్ అయి 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. సికిందర్ రజా (3-11), బ్రాడ్ ఎవాన్స్ (3-15) బౌలింగ్ దాడికి లంక బ్యాటర్లు నిలువలేకపోయారు. ఛేదనలో ముసెక్వివా (21*), రియాన్ బురి (20*) రాణించి జట్టుకు విజయం అందించారు. రజా 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కించుకున్నాడు. సిరీస్ 1-1తో సమమైంది. మూడో టీ20 సెప్టెంబర్ 7న జరగనుంది.