బడ్జెట్‌పై లోక్ సభలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ.. జనాలకు జ్వరం ఎక్కువైనప్పుడు ఏది పడితే అది అంటారని ప్రధాని విపక్ష ఎంపీలపై సెటైర్లు వేశారు. తన ప్రసంగానికి అడ్డుపడుతుండటంతో వారిని స్పీకర్ మందలించగా ఆయన ఈ విధంగా స్పందించారు. భారత్‌లో పుట్టకుండానే పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్న 10 కోట్ల మంది పేర్లను తొలగించినట్టు తెలిపారు. దీంతో అసలైన లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారని ప్రధాని పేర్కొన్నారు.