నేటితో కూటమి ప్రభుత్వ పాలన 100 రోజులు పూర్తవుతుంది. దాంతో ప్రభుత్వం ఇవాళ్టి నుంచి 26వ తేదీ వరకు ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ప్రజాప్రతినిధులు క్యాంపెయిన్ చేయనున్నారు. పెన్షన్ల పెంపు, మెగా డీఎస్సీ, అన్న క్యాంటీన్లు, అమరావతి-పోలవరానికి నిధులు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు తదితర 100 కార్యక్రమాలు చేశామని కూటమి నేతలు చెబుతున్నారు. 100 రోజుల కూటమి పాలనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి.