ఏపీలో అత్యవసర సేవలైన 108 సిబ్బంది సమ్మెకు దిగుతున్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూ కొద్ది రోజులు సిబ్బంది నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఒక రోజు నిరాహార దీక్ష చేసిన ఉద్యోగులు.. నేటి అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. 15 డిమాండ్లతో ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు.