AP: రాష్ట్రంలోని అవ్వాతాతలకు అండగా నిలిచేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వృద్ధాశ్రమాల ఏర్పాటుకు నిర్ణయించింది. అవసరమైన చోట వృద్ధాశ్రమాల ఏర్పాటుకు ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా.. తాజాగా 12 మంజూరయ్యాయి. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 32 వృద్ధాశ్రమాలు కేటాయిస్తే.. అందులో మన రాష్ట్రానికే ఎక్కువ దక్కాయి. అత్యధికంగా తిరుపతి జిల్లాకు 4 కేటాయించారు.
Follow us on: https://x.com/LokalAppTelugu