ఏపీలో 12వ వేతన సవరణ సంఘం కమిషనర్ మన్మోహన్ సింగ్ రాజీనామా చేశారు. మంగళవారం సీఎస్ నీరభ్ కుమార్‌కు మన్మోహన్ సింగ్ రాజీనామా లేఖ పంపారు. వ్యక్తిగత కారణాల వల్ల తనను రిలీవ్ చేయాలని మన్మోహన్ సింగ్ కోరారు. కాగా, 2023 జులైలో పీఆర్సీ కమిషనర్‌గా మన్మోహన్ సింగ్ నియమితులయ్యారు.