కలుషిత ఆహారం తిని 14మందికి అస్వస్థత

61చూసినవారు
కలుషిత ఆహారం తిని 14మందికి అస్వస్థత
AP: అల్లూరి జిల్లా పాడేరులో షాకింగ్ ఘటన జరిగింది. కలుషిత ఆహారం తిని 14 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులు పాడేరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనకాపల్లి జిల్లా నాతవరం నుంచి 20 మంది భక్తులు పాడేరు మొదకొండమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చారు. వారి ఇళ్ళనుంచి తెచ్చుకున్న పులిహోర తిని 14 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వీరిని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్