AP: 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను మెగా డీఎస్సీ ద్వారా ప్రభుత్వం భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ముగిసింది. 5.77 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 73,605 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 20 నుంచి ప్రభుత్వం మోడల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 30న హాల్‌టికెట్లు జారీ చేస్తారు. జూన్ 6 నుంచి జులై 6 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.