విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడలో 101 ఎకరాలు, విశాఖలో 98 ఎకరాలు కలిపి మొత్తం 199 ఎకరాల భూమి అవసరమని అధికారులు ప్రతిపాదించారు. ఇందుకు తదుపరి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. రెండు చోట్లా కలిపి తొలిదశ పనులకు రూ.11,009 కోట్లు అవసరమని అంచనా వేశారు. వీటికి 100% నిధులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు.