వరుసగా 2 వికెట్లు.. భారత్ 120/6
By Ravinder Enkapally 60చూసినవారుటీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 6 వికెట్లు కోల్పోయింది. బోలాండ్ బౌలింగ్‌లో వరుసగా పంత్ 40, నితీశ్ రెడ్డి 0 పరుగులకు ఔటయ్యారు. భారత్ ప్రస్తుత స్కోర్ 120/6. సుందర్(0*), జడేజా(15*) క్రీజులో ఉన్నారు. యశస్వి 10, కేఎల్ రాహుల్ 4, గిల్ 20, కోహ్లి 17 పరుగులకు వెనుదిరిగారు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 4 వికెట్లు.. మిచెల్ స్టార్క్, నాథన్ లైయన్ చెరో వికెట్ పడగొట్టారు.