ఆకాశ్ మిసైల్ సిస్టమ్ అధునాతన భారతీయ ఆయుధ వ్యవస్థ, శత్రు టార్గెట్లను క్షణాల్లో ట్రాక్ చేసి వాటిని ఛేదిస్తుంది. 250కి పైగా కంపెనీలు దీని సబ్‌సిస్టమ్స్, భాగాల ఉత్పత్తి, సప్లైలో నిమగ్నమై ఉన్నాయి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) రాడార్, C4I సిస్టమ్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) మిసైల్ ఉత్పత్తిని నిర్వహిస్తాయి. టాటా, లార్సెన్ అండ్ టౌబ్రో లాంచర్ సిస్టమ్స్, వాల్‌చంద్‌నగర్ రాకెట్ మోటార్ కేసింగ్స్ సరఫరా చేస్తాయి.