విమాన ప్రమాదంలో 265 మంది మృతి.. సుప్రీంకోర్టులో పిటిషన్

67చూసినవారు
విమాన ప్రమాదంలో 265 మంది మృతి.. సుప్రీంకోర్టులో పిటిషన్
అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో దాదాపు 265 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా విమానం AI171 ప్రమాదానికి సంబంధించి ఇద్దరు వైద్యులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని తక్షణమే సుమోటోగా విచారణ చేపట్టి, బాధిత కుటుంబాలకు పరిహారం అందించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారాన్ని వెంటనే ప్రకటించాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్