AP: ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. వీటిని అధికారికంగా గురువారం ప్రారంభించారు. '9552300009 వాట్సాప్ నెంబర్ ద్వారా ప్రభుత్వ సేవలు అందిస్తామని, సేవల్లో ఎవరికైనా అంతరాయం కలిగితే ప్రభుత్వమే ఫోన్ చేస్తుందని వెల్లడించారు. సర్టిఫికెట్లు విషయంలో ఇబ్బందులు పడుతున్నట్లు యువగళం పాదయాత్రలో గుర్తించామన్నారు. దాని కోసమే ఈ సేవలను ప్రవేశపెట్టామన్నారు. రెండో విడతలో 360 సేవలు ప్రారంభిస్తాం' అని అన్నారు.