AP: ప్రభుత్వ ఇంటర్, పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ల పోస్టుల భర్తీకి పరీక్షల కొత్త షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ ప్రకటించింది. జులై 15 నుంచి 23 వరకు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. డిగ్రీ లెక్చరర్లు 240, జూనియర్ లెక్చరర్లు 47, పాలిటెక్నిక్ లెక్చరర్లు 99 పోస్టులు (మొత్తం ఉద్యోగాలు 386) భర్తీ చేయనున్నారు. పరీక్షల షెడ్యూల్ కోసం https://psc.ap.gov.in/Documents/NotificationDocuments/WebNote_Exams_12062025.pdf లింక్‌పై క్లిక్ చేయండి.