జమ్మూ కశ్మీర్‌లో 87.09లక్షల మంది(జులై 25నాటికి) ఓటర్లున్నారని సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. 44.46లక్షల మంది పురుష ఓటర్లు, 42.62లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారని తెలిపారు. తొలిసారి ఓటువేసే వారు 3.71లక్షల మంది ఉన్నట్లు వెల్లడించారు. 20.7లక్షల మంది 20-29 ఏళ్ల లోపువారేనని చెప్పారు. జమ్మూ కశ్మీర్‌లో 87 నియోజకవర్గాలున్నాయని, 11,838 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నామని.. అక్కడి ప్రజలు ఓటేయడానికి ఉత్సాహంగా ఉన్నారన్నారు.