AP: శ్రీసత్యసాయి జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సోమందేపల్లి మారుతీనగర్‌లో ఇరువర్గాల మధ్య పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. స్థానికులు ఆపడానికి ప్రయత్నించిన ప్రయోజనం లేదని సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.