ఒడిశాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పిడుగులు పడి గత రెండు రోజుల్లోనే 9 మంది మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఆరుగురు మహిళలు ఉండగా.. మిగిలినవారు పురుషులు. అలాగే మరికొంతమంది తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ వరుస ఘటనలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు.