ఏపీ వ్యాప్తంగా తొలి రోజే 96 శాతం పింఛన్లు ప్రభుత్వం పంపిణీ చేసింది. ఉదయం 6 గంటల నుంచే సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు నగదు అందించారు. సాంకేతిక సమస్యలు, ఇతరత్రా సమస్యలతో ఆగినవి మినహా పంపిణీ ప్రక్రియ దాదాపుగా ఈరోజే పూర్తి కానుంది. మరోవైపు సత్యసాయి జిల్లా గుండుమలలో సీఎం చంద్రబాబు స్వయంగా లబ్ధిదారులకు పింఛన్లు అందించారు.