అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలోని దొడగట్ట రోడ్డు మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉన్న బిస్కెట్ గోదాంలోకి ఎలుగుబంటి చొరబడింది. కిటికీ అద్దాలు ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించింది. కడుపు నిండా బిస్కెట్లు తిని బయటకు వెళ్లిపోయింది. గోదాంలో బిస్కెట్లు చెల్లాచెదురుగా పడి ఉంటడాన్ని గమనించిన నిర్వాహకులు సీసీ ఫుటేజీ చెక్ చేశారు. ఎలుగుబంటి వచ్చినట్లు గుర్తించారు.