YCP మాజీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం

85చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుకు చేదు అనుభవం ఎదురైంది. నందిగామలో వరద బాధితులను పరామర్శించడానికి మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు వెళ్లారు. అయితే 'గో బ్యాక్ మాజీ ఎమ్మెల్యే' అంటూ వరద బాధితులు, టీడీపీ నేతలు ఆయన్ను అడ్డుకున్నారు. 'వరదల్లో చిక్కుకొని రెండు రోజులు ప్రజలు అవస్థలు పడితే తీరిగ్గా ఈ రోజు రాజకీయ లబ్ధి కోసం పరామర్శకు వచ్చవా' అంటూ మాజీ ఎమ్మెల్యేపై మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్