కిడ్నీ రాకెట్‌ వ్యవహారంలో ఐదుగురిపై కేసు నమోదు

60చూసినవారు
కిడ్నీ రాకెట్‌ వ్యవహారంలో ఐదుగురిపై కేసు నమోదు
విజయవాడలో కిడ్నీ రాకెట్‌ వ్యవహారానికి సంబంధించి ఐదుగురిపై కేసు నమోదైంది. రూ.30 లక్షలు ఇస్తామని నమ్మించి తన కిడ్నీ తీసుకొని డబ్బులు ఇవ్వకుండా మోసగించారని గుంటూరుకు చెందిన బాధితుడు గార్లపాటి మధుబాబు సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం విదితమే. దీనిపై స్పందించిన ఎస్పీ ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించారు. కిడ్నీ రాకెట్‌ వ్యవహారంలో బాషా, వెంకట్‌, సుబ్రహ్మణ్యం, డాక్టర్‌ శరత్‌బాబు, కిడ్నీ స్వీకర్త వెంకటస్వామిపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్