AP: కారులో ఏకాంతంగా ఉన్న ప్రేమజంటపై దొంగలు దాడి చేసి బంగారం, నగదు దోచుకెళ్లారు. ఈ ఘటన నంద్యాల శివారులోని రైతునగర్‌లో చోటు చేసుకుంది. ప్రభాస్ అనే యువకుడు తన ప్రేయసితో రైతునగర్ ప్రాంతంలో కారులో ఏకాంతంగా ఉండగా.. ముగ్గురు దొంగలు మాస్క్ వేసుకొని వచ్చారు. ప్రేమ జంటను బెదిరించి వారిపై దాడి చేశారు. కత్తులతో బెదిరించి రూ.10 వేల నగదు, యువతి మెడలో 3 తులాల గొలుసు లాక్కొని ఉడాయించారు. బాధితుల ఫిర్యాదుల మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.