పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఒక ప్రభుత్వ ఉద్యోగి కత్తితో రెచ్చిపోయాడు. అమిత్ సర్కార్ అనే వ్యక్తి ప్రభుత్వోద్యోగి. కోల్‌కతాలోని న్యూ టౌన్ టెక్నికల్ బిల్డింగ్‌లోని టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అయితే సెలవు విషయంలో ఆఫీసులో ఘర్షణ చోటుచేసుకుంది. అయితే అతడు కత్తి తీసుకుని నలుగురు సహోద్యోగులను పొడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.