AP: వైసీపీ హయాంలో శ్రీవారి ఆలయంలో భారీ స్కామ్ జరిగిందని టీటీడీ సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. కోట్లాది రూపాయల తులాభారం కానుకలను ఇంటి దొంగలే కాజేశారన్నారు. తులాభారం ద్వారా భక్తులు నిత్యం రూ.10 లక్షల కానుకలను సమర్పిస్తున్నారన్నారు. తులాభారంలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీవారి ఆలయంపై డ్రోన్లు ఎగరడం నిఘా వైఫల్యంగా భావిస్తున్నామని, త్వరలోనే యాంటీ డ్రోన్ టెక్నాలజీని తీసుకొస్తామన్నారు.