AP: రాష్ట్రంలో రెడ్‌బుక్ పేరుతో వెర్రిపాలన జరుగుతోందని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని విమర్శించారు. శనివారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై టీడీపీ నేతల హత్యాయత్నం దుర్మార్గమని అన్నారు. అక్రమాలను అడ్డుకుంటున్నాడనే ఆయనపై హత్యాయత్నం చేశారని వెల్లడించారు. ఏడాదిగా ప్రతిరోజూ రాజకీయ దాడులు జరుగుతున్నాయని తెలిపారు. పోస్టర్లను తప్పుపట్టేవారికి దాడులు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.