టీడీపీ అభ్యర్థికి తృటిలో తప్పిన ప్రమాదం

67చూసినవారు
టీడీపీ అభ్యర్థికి తృటిలో తప్పిన ప్రమాదం
ఉగాది రోజున నంద్యాల టీడీపీ అభ్యర్థి ఫరూక్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. నంద్యాల నుంచి కర్నూలుకు కారులో వెళ్తుండగా పాణ్యం మండలం తమ్మరాజుపల్లె వద్ద ఆయన వాహనం రోడ్డుపై బర్రెలను ఢీకొట్టింది. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. అయితే కారులో ఎయిర్ బెలూన్స్ వెంటనే తెరుచుకోవడంతో ఫరూక్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నంద్యాలలోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి ఫరూక్‌ని తరలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్