ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే విజయమని చాణక్య స్ట్రాటజీస్ వెల్లడించింది. తాజాగా నిర్వహించిన సర్వేలో బీజేపీకి 39-44 సీట్లు వస్తాయని పేర్కొంది. ఆప్‌కు 25-28 స్థానాలు, కాంగ్రెస్‌కు 2-3 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అలాగే పీపుల్స్ పల్స్ సర్వే బీజేపీ 51-60 సీట్లు గెలిచే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఆప్ మాత్రం 10-19 స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొంది. కాంగ్రెస్‌కు మాత్రం ఒక్క సీటు కూడా రాదని తెలిపింది.