AP: రాయలసీమలో సుప్రసిద్ధ జాతరగా పేరొందిన తిరుపతి ‘గంగమ్మ జాతర’కు అరుదైన గౌరవం లభించింది. తమిళనాడు ప్రభుత్వం తమ పాఠ్య పుస్తకాలలో జాతరను పాఠ్యాంశంగా చేర్చనుంది. పదో తరగతి తెలుగు రీడర్‌లో గంగ జాతర పాఠ్యాంశం ఉంటుంది. ఎస్వీ యూనివర్సిటీ ప్రొఫెసర్ పేట శ్రీనివాసులురెడ్డి రాసిన ‘గంగ జాతర’ను తమిళనాడు ప్రభుత్వం పాఠ్యాంశంగా ముద్రించింది. కాగా, తిరుపతి గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ 2023లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.