AP: ప్రకాశం జిల్లా ముండ్లమూరులో వరుస భూకంపాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. డిసెంబర్ 21 నుంచి మూడు రోజుల పాటు భూప్రకంపనలు సంభవించాయి. దీనిపై ఎన్జీఆర్ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి కీలక వ్యాఖ్యలు చేశారు. భూమిపై పొరలలో ప్రకంపనలు రావడం వల్లనే ఈ శబ్ధాలు వస్తున్నాయని.. శబ్ధాలు మాత్రమే రావడం ప్రమాదాలకు సంకేతం కాదని వారు చెప్పారు. నదీ పరివాహక ప్రాంతం కావడంతో భూకంపాలు వస్తుంటాయని.. ఎలాంటి ఆందోళన అవసరం లేదని తెలిపారు.