AP: రాష్ట్ర రాజధాని అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు విజయవాడ ఇబ్రహీంపట్నంలోని కృష్ణా నది లంక భూములను మంత్రి నారాయణ పరిశీలించారు. ఎన్టీఆర్ కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని పెదలంక, చినలంక భూములను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ క్రీడలు నిర్వహించేలా ఈ స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని సీఎం చందబాబు ఆదేశించారని, దీనికి 2 వేల ఎకరాల భూమి అవసరం అవుతుందని తెలిపారు.