రాజధాని అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవన సముదాయాలను హైదరాబాద్ ఐఐటీ నిపుణుల బృందం పరిశీలించింది. అనంతరం ఐఐటీ ప్రొఫెసర్లు సుబ్రహ్మణ్యం, మున్వర్ బాషా మీడియాతో మాట్లాడారు. 'భవనాల పటిష్టత, సామర్థ్యం నిర్ధరణకు మరికొంత సమయం పడుతుంది. భవనాల ప్రస్తుత స్థితి, నిర్మాణ సామాగ్రి తాజా స్థితిగతులను అంచనా వేయాల్సి ఉంటుంది. సాంకేతికంగా వాటిని పూర్తిగా పరిశీలించాక ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం' అని తెలిపారు.