మహిళల అండర్-19 ప్రపంచకప్ గెలవడంలో కీలకంగా వ్యవహరించిన తెలుగమ్మాయి గొంగడి త్రిష.. హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో త్రిషకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు ఘన స్వాగతం పలికారు. త్రిషను ఆదర్శంగా తీసుకుని.. తెలంగాణ నుంచి మరింత మంది మహిళా క్రికెటర్లు రావాలని ఆయన ఆకాంక్షించారు.