సైబర్ మోసగాళ్ల చేతిలో రూ.2.01 కోట్లు పోగొట్టుకున్న మహిళ

74చూసినవారు
సైబర్ మోసగాళ్ల చేతిలో రూ.2.01 కోట్లు పోగొట్టుకున్న మహిళ
కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌కు చెందిన ఏఎస్‌ వత్సల అనే మహిళ సైబర్‌ నేరగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయారు. నకిలీ పెట్టుబడి పథకంలో పెట్టుబడులు పెట్టి ఏకంగా రూ.2.01 కోట్లు పోగొట్టుకున్నారు. ఈ పథకంలో పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో లాభాలు ఉంటాయని సైబర్ నేరగాళ్లు నమ్మబలకడంతో జూన్‌ నుంచి ఆగస్టు వరకు నకిలీ ట్రేడింగ్ ఖాతాల్లో డబ్బును బదిలీ చేసింది. చివరికి మోసాన్ని గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్