దుబాయ్‌లో సాయంపేట యువకుడి మృతి

1105చూసినవారు
దుబాయ్‌లో సాయంపేట యువకుడి మృతి
దుబాయి వెళ్లిన యువకుడు అక్కడే మృతి చెందాడు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం సాయంపేటకు చెందిన ఆవుల ఓదెలు(35) 8 నెలల కిందట రూ.2లక్షల వరకు అప్పు చేసి దుబాయి వెళ్లాడు. ఇరవై రోజుల కిందట ఇంటికి ఫోన్‌ చేసిన ఓదెలు.. చేసిన పనికి వేతనం ఇవ్వడం లేదని, ప్రశ్నిస్తే కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఓదెలు మృతి చెందినట్లు కుటుంబానికి అక్కడున్న తెలుగువారి నుంచి సమాచారం అందింది. మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని ఆయన భార్య కోరుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్