ఏపీలో యువకుడు హల్‌చల్ చేశాడు. కాకినాడ జిల్లా తునిలో గంజాయి మత్తులో ఓ యువకుడు ఆదివారం రాత్రి వీరంగం సృష్టించాడు. అర్థనగ్నంగా నడిరోడ్డుపై నిలబడి రచ్చ చేశాడు. మరో ఇద్దరు యువకులు అతడిని నిలువరించడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చంపేస్తానంటూ పరుగులు పెట్టడంతో స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. పోలీసులు అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు.