ఏపీ ప్రభుత్వం పశు సంవర్ధక శాఖలో కీలక మార్పులు చేసేందుకు సిద్దమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడలో జరిగిన పశు సంవర్ధక శాఖ-టెక్ ఏఐ కాంక్లేవ్ ఆయన మాట్లాడారు. మనుషులకు ఆధార్ తరహాలో పశువులకు గోధార్‌పై ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. పైలట్ ప్రాజెక్టుగా తిరుపతి జిల్లాలోని పశువులకు గోధార్ అనుసంధానం చేయాలని సీఎం ఆదేశించారు. కోళ్లకు వచ్చే వ్యాధుల గుర్తింపు, ఆరోగ్య విషయాలపై ప్రత్యేక యాప్ తేవాలన్నారు.