AP: గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు బొండా ఉమ, బుద్ధా వెంకన్నపై దాడి చేసిన తురకా కిశోర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లో కిశోర్ ను పట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కిశోర్ అజ్ఞాతంలో ఉన్నారు. మాచర్ల YCP మాజీ MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇతడు ప్రధాన అనుచరుడు. 2020లో ఎన్నికల పరిశీలనకు మాచర్లకు వెళ్లిన బొండా ఉమ, వెంకన్నపై తురకా కిశోర్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో టీడీపీ నేతల కారు పూర్తిగా ధ్వంసమైంది.