నటుడు మోహన్ బాబు యూనివర్సిటీలో దారుణం

57చూసినవారు
నటుడు మోహన్ బాబు యూనివర్సిటీలో దారుణం
AP: తిరుపతిలోని నటుడు మోహన్ బాబు యూనివర్సిటీలో దారుణం చోటు చేసుకుంది. కులం పేరుతో దూషించి విద్యార్థిని దారుణంగా కొట్టారు. కొద్దిరోజుల క్రితం ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జేమ్స్ అనే విద్యార్థిని తన జూనియర్ యశ్వంత్ కులం పేరుతో దూషించాడు. తరచూ అవమానిస్తున్న యశ్వంత్‌ను జేమ్స్ మందలించాడు. దీంతో యశ్వంత్ కొందరు రౌడీ షీటర్లతో కలిసి జేమ్స్‌ను కిడ్నాప్ చేసి రౌడీ షీటర్లతో కలిసి జేమ్స్‌ను చిత్ర హింసలు పెట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్