AP: టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై ‘మా’ అసోసియేషన్‌లో నటి మాధవీలత ఫిర్యాదు చేశారు. సినిమాలో నటిస్తున్న మహిళల పట్ల జేసీ ప్రభాకర్ రెడ్డి అసభ్యకరంగా మాట్లాడారని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ‘మా’ ట్రెజరర్ శివ బాలాజీకి ఫిర్యాదు పత్రం అందజేశారు.