ఏపీలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించే వారికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా అదనపు సాయం అందనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఒక్కో యూనిట్ విలువ రూ.15 వేలు కాగా, కేంద్రం రూ.4వేలు, రాష్ట్రం రూ.2,667 చెల్లించేది. ఇకపై పట్టణ స్థానిక సంస్థల నుంచి మిగతా రూ.8333 కూడా మంజూరు చేస్తారు. దీంతో లబ్ధిదారులు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.