వర్షంలో ఫుడ్‌ డెలివరీకి అదనపు ఛార్జీలు

77చూసినవారు
వర్షంలో ఫుడ్‌ డెలివరీకి అదనపు ఛార్జీలు
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారాలు జొమాటో, స్విగ్గీ తమ ప్రీమియం సేవల విధానాల్లో మార్పులు తీసుకొచ్చాయి. ఇప్పటి వరకు వర్షంలో అదనపు ఛార్జీల నుంచి మినహాయింపును పొందుతున్న జొమాటో గోల్డ్, స్విగ్గీ వన్ సబ్‌స్క్రైబర్లు ఇకపై ఆ ఛార్జీలను చెల్లించాలి. వర్షంలో ఫుడ్ డెలివరీ కావాలంటే, వీరు కూడా నార్మల్ యూజర్లలాగే రూ.15 నుంచి రూ.30 వరకు అదనపు ఛార్జీలు చెల్లించాలి. ఈ కొత్త విధానం శుక్రవారం నుంచి అమలులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్