ఆసియాలో అతిపెద్ద ఏరోస్పేస్, రక్షణ రంగ ప్రదర్శన అయిన ‘ఏరో ఇండియా షో 2025’ను భారత రక్షణశాఖ ఇవాళ్టి నుంచి ఈనెల 14 వరకు నిర్వహించనుంది. బెంగళూరుకు సమీపంలోని యెలహంకలోఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో జరగనున్న ఈ షోను కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రారంభించనున్నారు. SU-57, F-35 యుద్ధ విమానాలు ఈ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.