నిరుద్యోగ యువతకు గుంటూరులోని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ శుభవార్త చెప్పింది. ఏపీలోని 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన అభ్యర్థుల కోసం అగ్నివీర్ సిబ్బంది నియామకాలు 2025-26 నమోదును ప్రారంభించింది. వివిధ కేటగిరీల అగ్నివీర్ నియామకం కోసం వెబ్‌సైట్, ఇతర వివరాలను విడుదల చేసింది. ఆసక్తి గలవారు www.joinindianarmy.nic.in ద్వారా నమోదు చేసుకోవచ్చు. అప్లికేషన్స్‌కు ఏప్రిల్ 10న చివరి తేదీగా ప్రకటించారు.