వ్యవసాయంలో ప్రధాన సమస్య చీడపీడలు, తెగుళ్లు. వీటిని గుర్తించడంలో ఆలస్యం, గుర్తించినా అది ఏ తెగులు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం తెలియకపోవడం వల్ల ఎక్కువ మంది రైతులు నష్టపోతున్నారు. పంటకు తెగులు సోకితే ఆ ఫోటో తీసి రైతు వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేయగానే అది ఏ తెగులు, ఏ మందులు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి అనే సమాచారాన్ని అధికారులు అందిస్తున్నారు. దీనివల్ల రైతులకు సకాలంలో సమాచారం అందుతోంది.