AP: తిరుమలలో ఓ భక్తుడి వద్ద ఎయిర్ గన్‌ను అధికారులు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తిరుమల వాహన తనిఖీ కేంద్రం వద్ద రోజు మాదిరిగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన భక్తుడు మహేశ్ కారులో అక్కడికి వెళ్లారు. అయితే అతని కారులో ఎయిర్ పిస్టల్‌ను పోలీసులు గుర్తించారు. ఎయిర్ పిస్టల్, టెలీస్కోప్ స్వాధీనం చేసుకున్నారు. తిరుమల కొండపైకి ఎయిర్‌గన్‌కు అనుమతి లేదని చెప్పడంతో కారుతో సహా అతను వెనుదిరిగి వెళ్లిపోయారు.