ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫ్లాష్ సేల్ పేరుతో రూ.1300కే విమాన టికెట్లు అందిస్తున్నట్లు వెల్లడించింది. సంస్థ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తించనున్నట్లు పేర్కొన్నారు. అయితే జూన్ 1 నుంచి సెప్టెంబర్ 15 మధ్య ప్రయాణాలు చేసే వారికి మాత్రమే ఆఫర్‌లో టికెట్లు ఇవ్వనుంది. ఇక ఈ బుకింగ్ మే18తో ముగియనుంది.