దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి తీవ్రంగా మారింది. ధూళి, దుమ్ము కమ్ముకున్న ఆనంద్ విహార్‌లో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరింది. అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 298గా నమోదైంది. నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గాలి నాణ్యత పడిపోవడంతో ప్రజలు శ్వాస సంబంధిత సమస్యలు, కళ్ల మంటలు వంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.